హైదరాబాద్ : ఇరాన్(Iran)ఓడరేవులపై దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు హర్మూజ్‌ను(Strait of Hormuz) మూసే ఉంచుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్(ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. యుద్ధ విరమణ షరతులను అమెరికా ఉల్లంఘించింది అని ఐఆర్‌జీసీ ఆరోపించింది. అమెకరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటలనకు ఎలాంటి విశ్వసనీయత లేదని మండిపడింది. అమెరికా చర్యల వల్లే మళ్లీ హర్మూజ్‌ను మూసివేశామని తన చర్యలను సమర్ధించుకుంది.
ఈ నేపథ్యంలో హర్మూజ్ ద్వారా ఏ నౌక కూడా మా అనుమతి లేకుండా కదలకూడదని పేర్కొంది. ఎవరైనా మా నిబంధనలు ఉల్లంఘిస్తే హర్మూజ్ జలసంధిని సమీపించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఐర్‌జీసీ హెచ్చరించింది. దీనికి నౌకలు, వాటి యజమానులు మా నుంచి వచ్చే సమాచారం ప్రకారం ముందుకెళ్లాలని సూచించింది
కాగా, హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో హొర్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నిస్తున్న భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా భారత్‌లోని ఇరాన్ రాయబారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. హొర్ముజ్ జలసంధిని తెరచినట్టు ప్రకటించిన ఇరాన్ 24 గంటలు కూడా కాకముందే దానిని మూసివేసింది.
అదే సమయంలో జలసంధి మీదుగా వెళ్లేందుకు జగ్ అర్నవ్, సాన్మర్ హెరాల్డ్ అనే రెండు భారత్ నౌకలు ప్రయత్నించాయి. వాటిలో జగ్ అర్నవ్‌పై ఇరాన్ నౌకా దళం కాల్పులు జరిపింది. హొర్ముజ్ జలసంధి వద్ద ఒమన్ ఉత్తర దిశలో ఉండగా ఇరాన్ ఈ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. కాల్పులతో ఈ రెండు నౌకలు తిరిగి వెనక్కి వెళ్లినట్టు తెలుస్తున్నది.
