Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Krishank | దళిత నేతపై దమనకాండ.. క్రిశాంక్‌పై రెండేళ్లలో 20 కేసులు

Ai generated article, credit to orginal website, April 25, 2026

Krishank | హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24(నమస్తే తెలంగాణ)/ హైదరాబాద్‌ సిటీబ్యూరో : తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించాల్సింది పోయి, అక్రమాలను ప్రశ్నించిన, అవినీతిపై గొంతెత్తిన వారిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉకుపాదం మోపుతున్నది. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టినా, కుంభకోణాలను వెలికితీసినా అక్రమ కేసులతో గొంతునొకడం నిత్యకృత్యమైంది.
క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ నేతలను ఎదురోలేక, పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని సాగిస్తున్న ఈ దాష్టీకం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌, పార్టీ అధికార ప్రతినిధి దళిత నేత మన్నె క్రిశాంక్‌ను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసుల వల విసురుతున్నారు.
ప్రతీ చిన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ, రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పోలీస్‌ యంత్రాంగాన్ని వాడుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు క్రిశాంక్‌పై రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదయ్యాయి. 2024లో మొదలైన ఈ కేసుల దాడి 2025 సంవత్సరంలో పరాకాష్టకు చేరగా, 2026 నాటికి అది మరింత ఉధృతమైంది. ఒకే సంవత్సరంలో పదికి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వేధింపులకు పాల్పడుతున్నదో వర్ధమాన దళిత నేత క్రిశాంక్‌పై పెట్టిన కేసుల సెక్షన్లు పరిశీలిస్తే అర్థమవుతుంది.
న్యాయం అడిగితే రిమాండా?
ఈ కేసుల పరంపరలో తాజా ఉదంతం మరింత దారుణంగా ఉన్నది. తన భార్యపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని, బాధ్యుడైన రాజేంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీపీకి ఫిర్యాదు చేశారు. మహిళపై నిరాధార ఆరోపణలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలిపినందుకు క్రిశాంక్‌పైనే ఉల్టా కేసు బనాయించారు.
అదే రాజేంద్రకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కూకట్‌పల్లి పోలీసులు క్రిశాంక్‌తో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో క్రిశాంక్‌ను అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయనను సంగారెడ్డి జైలుకు తరలించారు. రాజకీయంగా ఎదురోలేక, ఇలాంటి పోలీసు కేసులతో భయపెట్టాలని చూడటం కాంగ్రెస్‌ మార్‌ రాజకీయాలకు నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు.
పక్కా ప్లాన్‌తోనే అరెస్ట్‌
పక్కా ప్లాతోనే క్రిశాంక్‌ను అరెస్ట్‌కు రంగం సిద్ధంచేశారు. మొదట కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి బాలానగర్‌ ఏసీపీ ఆఫీస్‌కు తరలించా రు. గురువారం రాత్రి వరకు ఇది కొనసాగింది. రాత్రి 11గంటల సమయంలో క్రిశాంక్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకుపోతున్నారనే సమాచారం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ లీగల్‌ బృందం, నాయకులు ఆరా తీశారు. వైద్య పరీక్షలకు తీసికెళ్తున్నారని గుర్తించి, అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో జడ్జి ఇంటి వద్దకు క్రిశాంక్‌ను తీసుకుపో యారు.
అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు జడ్జి ముందు పోలీసులు రిమాండ్‌ రిపోర్టును ఉంచారు. అయితే ఫిర్యాదులో లేని 308 క్లాస్‌-5 సెక్షన్‌ పెట్టడం అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ కారణంగానే తిరిగి క్రిశాంక్‌ను తిరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా స్టేషన్‌లోనే రాత్రంతా క్రిశాంక్‌ను నిర్బంధించారు. సొంత పూచీకత్తుపై వదిలేసి, ఉదయం రమ్మని చెప్పే వీలున్నా.. పోలీసులు మాత్రం వేధించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు ఆయన అనుచరులు ఆరోపించారు.
క్రిశాంక్‌ లేవనెత్తిన అవినీతి అంశాల్లో కొన్ని ఇవే..

ఏడాది 2లక్షల ఉద్యోగాలు? జాబ్‌ క్యాలెండర్‌? మెగాడీఎస్సీ హామీలు ఏమయ్యాయని మీడియా సాక్షిగా నిలదీశారు.
సీఎం మీడియా ముఖంగా ఏదైనా ఒక వ్య వహారంపై బెదిరిస్తారని, ఆ తర్వాత తన అన్న తిరుపతిరెడ్డి వెళ్లి సెటిల్‌మెంట్‌ చేస్తార ని, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థతో అదే దందా జరిగిందని ఆధారాలతో వెల్లడించారు.
రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే ఆ దాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మీడియాకు చెప్పారు. సర్వీస్‌ చార్జ్‌లను టన్నుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3 నుంచి రూ.100కి పెంచినా ఆ దా యం మాత్రం పెరుగకపోవడం అనుమా నం కలిగిస్తున్నదని ఆరోపణలు చేశారు.
హైదరాబాద్‌లో అందాల పోటీల్లో తన పట్ల కాంగ్రెస్‌ నేతలు కొందరు అసభ్యంగా ప్రవర్తించారని మిస్‌ ఇంగ్లండ్‌ చేసిన ఆరోపణలు ఒక మీడియాలో ప్రచురితమైతే ఆ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.
టెండర్‌ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలను కట్టబెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని వి వరాలను మీడియాకు వెల్లడించారు.
కేపీసీపై అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్‌.. ఇప్పుడు అదే కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్‌ ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌ ఎఫ్‌-3 ఫార్ములా(ఫ్రెండ్‌, ఫ్యామిలీ, ఫ్రాడ్‌స్టర్స్‌) అనుసరిస్తున్నారని, సుంకిశాల, మూసీ, అమృత్‌, మ్యాక్స్‌బీన్‌ పనులను తన వారికే కట్టబెడుతున్నారని ఆధారాలతో మీడియాకు వివరించారు.
హెచ్‌సీయూలోని కంచె గచ్చిబౌలి భూము ల్లో జీవవైవిధ్యం ఉన్నదని, ఆ భూమిని అ మ్మేందుకు జీవవైధ్యాన్ని రేవంత్‌రెడ్డి స ర్కార్‌ బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నదని ఫొటోలు, వీడియోలతో పోస్ట్‌ చేశారు.
రూ.8కోట్లు ఇవ్వాలని భ్రమర ఇన్‌ఫ్రా యాజమాన్యాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ బెదిరించారని, ఆయనపై కేసు న మోదు చేయాలని డిమాండ్‌ చేశారు.
సీఎంవో నుంచి ఫేక్‌న్యూస్‌ రాకెట్‌ నడుస్తున్నదని, అడ్డగోలు థంబ్‌ నెయిల్స్‌ ఫేక్‌వార్త లు వండి వారుస్తారని ఆరోపించారు. వా రు చేస్తున్న తప్పుడు వార్తలను ఆధారాలతో మీడియాకు వివరించారు.
సోం డిస్టిలరీ సంస్థ కమీషన్లపై సిట్టింగ్‌ జ డ్జితో విచారణ జరిపించాలని, 1.31 కోట్లు ఆ డిస్టిలరీ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయని పేర్కొన్నారు. నకిలీ సంస్థపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు అం శంలో వందల కోట్లు చేతులు మారాయని, విచారణ కోసం ఈడీకి ఫిర్యాదు చేశారు.
తాజాగా పోషన్‌ అభియాన్‌ కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసి అందజేసే అంశంలో రూ.8.5 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదని బయటపెట్టారు. మంత్రి సీతక్క చూస్తున్న ఈ శాఖలో జరిగే అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదులో లేని సెక్షన్లతో తప్పుదోవ
శుక్రవారం క్రిశాంక్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సెక్షన్‌ 308 క్లాస్‌-5 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ ఇక్కడ వర్తించందని ఆ సెక్షన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో మిగతా సెక్షన్లన్నీ ఏడేండ్ల లోపు ఉన్నవే కావడంతో నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. దీంతో పోలీసులు కొత్త డ్రామా చేశారు.. నిబంధనలు తుంగలో తొక్కారు.
క్రిశాంక్‌పై 21 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మెమో దాఖలు చేశారు. ముందుగా తమ కౌన్సిల్‌ నోటీసులు ఇచ్చి పోలీసులు మెమో దాఖలు చేయాలి, కానీ అలా ఎలాగైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఇలా చేశారు. పోలీసులు పెట్టిన మెమోను బీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ బృందం గట్టిగా వ్యతిరేకించింది. వాదనలు విన్న న్యాయస్థానం క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురికి రిమాండ్‌ విధించింది. క్రిశాంక్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు సోమవారం న్యాయస్థానం ముందుకు రానున్నాయి. ఇదిలా ఉండగా 308 క్లాస్‌ను న్యాయస్థానం తొలగించిందంటే పోలీసుల దర్యాప్తులో లోపాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ న్యాయవాదులు పేర్కొన్నారు. పోలీసులు మెమోను దాఖలు చేసి కోర్టును సైతం తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
– బీఆర్‌ఎస్‌, లీగల్‌ సెల్‌ ప్రతినిధి, జక్కుల లక్ష్మణ్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు క్రిశాంక్‌పై నమోదైన కేసులు

పోలీస్‌స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌
కూకట్‌ పల్లి = 576/2026
కార్ఖానా = 34/2026
మారేడ్‌పల్లి =77/2026
మారేడ్‌పల్లి = 13/2026
సైబర్‌ క్రైమ్స్‌ = 143/2025
నకిరేకల్‌ = 85/2025
నకిరేకల్‌ = 86/2025
నకిరేకల్‌ = 87/2025
గచ్చిబౌలి = 621/2025
గచ్చిబౌలి = 630/2025
గచ్చిబౌలి = 631/2025
గచ్చిబౌలి = 632/2025
మారేడ్‌పల్లి = 141/2025
బోరబండ = 623/2025
రాజేంద్రనగర్‌ = 599/2025
సైబర్‌ క్రైమ్స్‌ = 1848/2024
ఓ.యూ = 207 of 2024
మాదాపూర్‌ = 327/2024
సైబర్‌ క్రైమ్స్‌ = 680/2024
మాదాపూర్‌ – 396/2024

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీ వృథా బెంగళూరు భ‌ళా
  • రాఘ‌వ్ చ‌ద్దా రాజీనామా బీజేపీలోకి జంప్
  • శ్రీ కోదండ రాముని మహోత్సవం దివ్య పుష్ప యాగం
  • స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు 53 ఏళ్లు
  • ఏపీలో వ‌డ‌గాడ్పుల మోత జ‌నం విల విల

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes